శివానంద ధ్యాన యోగం గురించి:
శివానంద ధ్యాన యోగం అనేది సాధకుడు పరమాత్మతో విలీనం కావడానికి వీలు కల్పించే యోగ విధానం. సాధకులచే ఈ యోగము మొదట ప్రాణాయామం చేసి, తరువాత ఓంకారం/ప్రణవం వినడం ద్వారా అభ్యసించబడుతుంది . మొదటగా సాధకులు ఓంకారం ఉచ్ఛరించి , ఆ శబ్దాన్ని గుర్తుంచుకుని వినగలిగేంత వరకు దాని జపం చేయాలి. దీనిని నాద మూలాన్వేషణ అని అంటారు
సాధకులు తమ గొంతులో లేదా తమ గురువు గొంతులో ఓంకారం శబ్దాన్ని వినాలని గురు సూచన.
సాధకులు ఈ వెబ్సైట్లో షెడ్యూల్లోని సమయాల ప్రకారం ప్రతిరోజూ గురువుగారి గళంలో ఓంకారం వినవచ్చు. కొంత కాలం పాటు సాధకుడు గురువుగారు స్వరంలో ఓంకారం వినగలరు.
ఉత్తమ ఫలితాల కోసం, ఒక గంటలో 1800 సార్లు అంటే ఒక నిమిషానికి 30 సార్లు ఓంకారం వినాలని సూచించబడింది.