పూజ్య గురువుగారు ప్రభుత్వ ఉద్యోగం నుండి పదవీ విరమణ పొందిన తరువాత భీమిలి లో స్థిరపడ్డారు.ఆ ప్రదేశానికి ఆనందవనం అని పేరు పెట్టారు.విశ్వేశ్వరు కొలువై ఉన్నకాశీని ఆనంద వనం అని కూడా పిలుస్తారు. కాశీ విశ్వనాథ దేవాలయం మరియు ఆనందవనం భీమిలి రెండూ 83 డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉండడం విశేషం. 1985 నుండి భీమిలిలో గురువుగారితో పాటు పలువురు శిష్యులు కూడా ఉండేవారు. పూజ్యగురువులు వారి దైనందిత పూజ మరియు అభిషేకం తర్వాత సాధకులను మరియు సాధారణ ప్రజలను కలుసుకునేవారు.
గురువుగారు ఆనందవనం విమోచన స్థలమని చెప్పేవారు. సత్వము, రజస్, తమస్సు అనే మూడు గుణాలు సమస్థితిలో ఉన్నప్పుడు ఆత్మ విముక్తి పొందుతుంది. ఈక్షేత్రంలో ఈ దేవతలను ఆరాధించడంతో పాటుగా సాధన చేయడం వల్ల ఆత్మ సమతుల్యతను సాధించడంలో మరియు తద్వారా విముక్తి పొందడంలో సహాయపడుతుంది.
పూజ్య గురువుగారు పరమగురువు ద్వారా యోగ గణపతి ఆలయాన్ని ఏర్పాటు చేశారు. ఇది పరమగురువు యొక్క శాశ్వత స్థానం. ఇక్కడ ఉన్న యోగ గణపతిని వారి సాధనను సుభిక్షంగా రక్షించడానికి మరియు మార్గదర్శకత్వం కోసం తప్పక పూజించాలి.
ఈ ఆలయంలో,గణపతి సాక్షిగా ఉండి సాధకుడి ఆత్మను పరిశీలిస్తారు. సాధకుడి కోరికలు తీర్చేవిధం గా పీఠాధిపతికి సిఫార్సు చేయడమే కాక అదే క్రమంలో వివిధ కోరికలను తొలగించి సాధకుడిని విముక్తికి అర్హునిగా చేస్తాడని నమ్మిక.
ఈ ఆలయ ప్రధాన దేవత మహాలక్ష్మి ద్వారా ప్రాతినిధ్యం వహించే మహాశక్తి. దశ మహావిద్యలు మరియు సప్త మాతృకల ఆశీస్సులు పొందిన తర్వాత సాధకుడు ఆలయ గర్భగుడికి ప్రయాణం చేస్తాడు.
తూర్పు తీరాన్ని పశ్చిమ తీరం వలె సంపన్నంగా మార్చడానికి గురువుగారు ఇక్కడ ఈ ఆలయాన్ని స్థాపించారు. దేశంలోని ఈ ప్రాంతంలో నివసించే ప్రజల భౌతిక లాభాలను మాత్రమే కాకుండా వారి ఆధ్యాత్మిక పురోగతిని కూడా మహాలక్ష్మి ప్రసాదిస్తుంది.
దేవాలయాలతో పాటు, సాధకులు తమ ఆధ్యాత్మిక పురోగతికి ఉపయోగించుకోగల ధ్యాన మందిరం కూడా ఇక్కడ ఉంది.
1950లో పోలీసు శాఖలో ప్రభుత్వ ఉద్యోగం కోసం గురువుగారు వరంగల్ కు వచ్చారు. ఆయన 1982 వరకు సర్వీసులో ఉన్నారు.
ఆ కాలం లో గురువుగారు వరంగల్ ను తన నివాసంగా చేసుకుని మూడు దశాబ్దాలకు పైగా ఇక్కడే ఉన్నారు. వరంగల్ అంటే కాకతీయులు దేశభక్తి మరియు శివభక్తితో పరిపాలించిన ప్రదేశం అని ఆయన చెప్పేవారు. వరంగల్ లోని గురువుగారి నివాసం గురుధామ్ గా పిలవబడుతుంది .
పూజ్య గురువుల సమాధి వరంగల్ లో ఉంది.
గురుధామ్ మాత్రమే కాకుండా, అదే ప్రదేశంలో సప్తధామ్ కాంప్లెక్స్ కూడా ఉంది. ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రం, ఇక్కడ సాధకులు వివిధ మహర్షులు, గురువులు మరియు దేవతల ఆశీస్సులు పొందవచ్చు.
ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లాలోని కుమావున్ శ్రేణిలఉంది జగేశ్వర్. ఇక్కడ మహా మృత్యుంజయ మరియు పుష్టి మాత ప్రధాన దేవతలుగా ఉన్నారు .. ఇది చాలా పురాతనమైన ఆలయ సముదాయం. మహర్షులు మహా మృత్యుంజయ మంత్రాన్ని మొదట విన్న ప్రదేశం ఇది. ఈ ప్రదేశానికి దగ్గరగా వృద్ధ జగేశ్వర్ కూడా ఉంది, ఇక్కడ పార్వతి మాత శివుడిని వివాహం చేసుకోవడానికి తన తపస్సు చేసినది.
ఇక్కడ జగేశ్వర్‌లో ఒక మహా యోగి ఉండేవాడని, అతనికి అనేక మంది శిష్యులు ఉండేవారని గురూజీ తెలియజేశారు. పూజ్య గురువులే వారి పూర్వ అవతారం లో ఆ మహా యోగి అని నమ్మిక . గురువుగారు ఈ ప్రదేశాన్ని గుర్తించి, దాని చరిత్రను ఆలయ ప్రస్తుత నివాసితులు మరియు పూజారులతో పంచుకున్నారు. కుమావున్ శ్రేణిని సుబ్రహ్మణ్య స్వామి నివాసం అని కూడా పిలుస్తారు అందుకే ఈ పర్వత ప్రాంతాన్ని కు స్వామి పేరుతో అనగా కుమావున్ అని పిలుస్తారు . ఆయన కుమావున్ దేవధర్ అడవులలో సంచరిస్తున్నట్లు కనిపిస్తారని అత్యధికులు నమ్ముతారు.